kaleswaram project: కాళేశ్వరంను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది: మేడిగడ్డ వద్ద కిషన్ రెడ్డి

  • లక్ష్మణ్, ఈటల, రఘునందనరావు తదితర బీజేపీ నేతలతో కలిసి పరిశీలించిన కిషన్ రెడ్డి
  • కాళేశ్వరం ప్రాజెక్టు ప్రమాదంలో పడిందన్న కేంద్రమంత్రి
  • ప్రజల పన్నులతో కట్టిన జాతీయ సంపద కాళేశ్వరమని వ్యాఖ్య
BJP leaders at medigadda project

గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకోకుండా కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ కుంగుబాటు గురించి మాట్లాడకూడదనే ఉద్దేశంతో తాము ఇప్పుడు ప్రాజెక్టును సందర్శించామని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. శనివారం రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఈటల రాజేందర్‌, మరికొందరు బీజేపీ నేతలతో కలిసి ఆయన కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... కాళేశ్వరం ప్రాజెక్టు ప్రమాదంలో పడిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు అనుమానాస్పదంగా మారిందన్నారు. ప్రజల పన్నులతో కట్టిన జాతీయ సంపద ఈ ప్రాజెక్టు అని, అందుకే దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు.

కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు, విధానాలపై తెలంగాణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. మేడిగడ్డ వద్ద కుంగిన ప్రాంతాన్ని పూర్తిగా తొలగించాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఇచ్చిందన్నారు. గ్రౌండ్ రిపోర్ట్ చూశాక మాట్లాడాలనే ఉద్దేశ్యంతో తాము ఈ ప్రాజెక్టును సందర్శిస్తున్నామన్నారు. కాగా, బీజేపీ నేతలు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మేడిగడ్డ వద్దకు చేరుకున్నారు.

More Telugu News