తిరిగొచ్చిన లావణ్య, వరుణ్ తేజ్.. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో నవదంపతులు.. వీడియో ఇదిగో!
- ఇటలీలో పెళ్లి వేడుకల తర్వాత హైదరాబాద్ కు తిరిగిరాక
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
- రేపు నగరంలో భారీ ఎత్తున రిసెప్షన్ వేడుక
దీంతో ఇటలీ నుంచి శనివారం ఉదయం ఈ నవదంపతులు హైదరాబాద్ కు చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ లో ఈ జంటను తమ కెమెరాల్లో బంధించేందుకు ఫోటోగ్రాఫర్లు పోటీపడ్డారు. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా, వివాహం అతికొద్దిమంది సన్నిహితుల మధ్య జరగడంతో రిసెప్షన్ కు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులను ఆహ్వానించినట్లు సమాచారం. భారీ ఎత్తున జరగనున్న ఈ రిసెప్షన్ వేడుక కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది.