LavanyaVarun: తిరిగొచ్చిన లావణ్య, వరుణ్ తేజ్.. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో నవదంపతులు.. వీడియో ఇదిగో!

  • ఇటలీలో పెళ్లి వేడుకల తర్వాత హైదరాబాద్ కు తిరిగిరాక
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
  • రేపు నగరంలో భారీ ఎత్తున రిసెప్షన్ వేడుక
Newly Married Couple LavanyaVarun Came Back To Hyderabad

ఇటలీలో ఘనంగా పెళ్లి చేసుకున్న లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ హైదరాబాద్ కు తిరిగొచ్చారు. శనివారం ఉదయం ఈ కొత్త జంట శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగింది. భర్తతో కలిసి చిరునవ్వులు చిందిస్తూ లావణ్య ఎయిర్ పోర్ట్ లో సందడి చేసింది. ఈ నెల 1న ఇటలీలోని టస్కానీలో లావణ్య, వరుణ్ ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ పెళ్లి వేడుకల్లో మెగా ఫ్యామిలీతో పాటు సమీప బంధుమిత్రులు, టాలీవుడ్ హీరోహీరోయిన్లు పాల్గొన్నారు. ఈ నెల 5న హైదరాబాద్ లో లావణ్య, వరుణ్ ల పెళ్లి రిసెప్షన్ జరగనుంది.

దీంతో ఇటలీ నుంచి శనివారం ఉదయం ఈ నవదంపతులు హైదరాబాద్ కు చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ లో ఈ జంటను తమ కెమెరాల్లో బంధించేందుకు ఫోటోగ్రాఫర్లు పోటీపడ్డారు. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా, వివాహం అతికొద్దిమంది సన్నిహితుల మధ్య జరగడంతో రిసెప్షన్ కు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులను ఆహ్వానించినట్లు సమాచారం. భారీ ఎత్తున జరగనున్న ఈ రిసెప్షన్ వేడుక కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది.

More Telugu News