KTR: టీడీపీపై విమర్శలకు కారణం చెప్పిన కేటీఆర్.. లోకేశ్ ఆందోళన సబబేనన్న బీఆర్ఎస్ నేత

KTR responds about Lokesh concern on Chandrababu
  • 2018లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుని తెలంగాణలో పోటీ చేసింది కాబట్టే విమర్శించామన్న కేటీఆర్
  • ఇప్పుడు లేదు కాబట్టి ఆ ఊసు లేదని స్పష్టీకరణ
  • చంద్రబాబు అరెస్టును మానవీయ కోణంలో చూడాలన్న బీఆర్ఎస్ నేత
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడి అరెస్ట్ విషయంలో లోకేశ్ ఆందోళన సహేతుకమైనదేనని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకుని తెలంగాణలో పోటీ చేసింది కాబట్టే అప్పుడు టీడీపీని విమర్శించినట్టు చెప్పారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం లేదు కాబట్టి ఇక విమర్శలకు తావెక్కడని ప్రశ్నించారు. 

వ్యక్తిగతంగా కానీ, మానవీయ కోణంలో కానీ చూస్తే.. 73 ఏళ్ల వయసులో చంద్రబాబును అరెస్ట్ చేయడాన్ని చూసి ఎవరైనా ‘అయ్యో  పాపం’ అనే అంటారని పేర్కొన్నారు. చంద్రబాబు జీవితానికి ప్రమాదం పొంచి ఉందన్న లోకేశ్ ఆందోళన సహేతుకమైనదేనని కేటీఆర్ పేర్కొన్నారు.
KTR
Nara Lokesh
Chandrababu

More Telugu News