Siddaramaiah: హంపిలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య డ్యాన్సు... వీడియో ఇదిగో!

  • హంపిలో కర్ణాటక రాజ్యోత్సవ కార్యక్రమం
  • ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఎం సిద్ధరామయ్య
  • ఓ సంప్రదాయ గీతానికి కాలు కదిపిన వైనం
Karnataka CM Siddaramaiah dances in Hampi

కర్ణాటకలోని హంపిలో కర్ణాటక రాజ్యోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఎం సిద్ధరామయ్య తనదైన శైలిలో డ్యాన్స్ చేసి అందరినీ అలరించారు. ఆయన గతంలోనూ పలు సందర్భాల్లో డ్యాన్సులు చేశారు. తాజాగా కన్నడ రాజ్యోత్సవ కార్యక్రమంలో ఓ సంప్రదాయ గీతానికి సిద్ధరామయ్య కాలు కదిపిన తీరు అందరినీ ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.

More Telugu News