K Kavitha: కేసీఆర్ ను ఎదుర్కోవాలంటే మరో కేసీఆర్ పుట్టాలి: కవిత

No one can defeat KCR says Kavitha
  • కేసీఆర్ లాంటి గొప్ప నేతను కొట్టడం ఎవరి తరం కాదన్న కవిత
  • కాంగ్రెస్ హయాంలో నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని విమర్శ
  • ఉద్యోగాల గురించి మాట్లాడే అర్హత రేవంత్ కు లేదని వ్యాఖ్య
కేసీఆర్ లాంటి గొప్ప నాయకుడిని కొట్టడం ఎవరి తరం కాదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత అన్నారు. ఆయనకు ఆయనే సాటి అని... అయనను ఎదుర్కోవాలంటే మరో కేసీఆర్ పుట్టాలని చెప్పారు. కేసీఆర్ మనసు మహా సముద్రం అని, ఆయన ఆలోచన ఆకాశమని అన్నారు. ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయకుండా నిరుద్యోగులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఉద్యోగ నియామకాలను, ఈ పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన నియామకాలను పరిశీలిస్తే నిరుద్యోగులకు అన్యాయం చేసింది ఎవరో తెలుస్తుందని చెప్పారు. 

కేసీఆర్ పాలనలో 2 లక్షల 32 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరిగిందని కవిత అన్నారు. వీటిలో లక్ష 60 వేల ఉద్యోగాల భర్తీ ఇప్పటికే జరిగిందని... మిగిలిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో ఉందని చెప్పారు. ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులను రేవంత్ రెడ్డి అడ్డా కూలీలతో పోల్చారని విమర్శించారు. రేవంత్ రెడ్డికి ఉద్యోగాల గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పారు.

K Kavitha
BRS
KCR
Revanth Reddy
Congress

More Telugu News