Buggana Rajendranath: గ్రాంట్ ఇన్ కైండ్ అనే పద్దతే లేదని సీమెన్స్ కంపెనీ చెప్పింది: పయ్యావులకు బుగ్గన కౌంటర్

  • స్కిల్ కేసులో పయ్యావుల వ్యాఖ్యలు
  • కోర్టు తేల్చేంత వరకు పయ్యావుల కాస్త ఓపిక పట్టాలన్న బుగ్గన
  • కోర్టుకు ఆధారాలు చూపించామో లేదో వీళ్లకు తెలుసా అంటూ ఆగ్రహం
Buggana counters Payyavula Keshav claims

స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారంలో టీడీపీ నేత పయ్యావుల కేశవ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. స్కిల్ కేసులో 2017 నుంచి విచారణ జరుగుతోందని తెలిపారు. 

జీఎస్టీ వల్ల స్కిల్ స్కాం బయటపడిందని, దీనిపై జీఎస్టీ, ఈడీ, సెబీ కూడా విచారణ జరిపాయని వివరించారు. ఇంతటి తీవ్రత ఉన్న కేసులో సీఐడీ విచారణ చేయకూడదా? అని బుగ్గన ప్రశ్నించారు. 

స్కిల్ వ్యవహారంలో గ్రాంట్ ఇన్ కైండ్ అనే పద్దతే లేదని సీమెన్స్ సంస్థ స్పష్టం చేస్తోందని అన్నారు. ఏ విధంగా చూసినా ఈ కుంభకోణంలో రూ.250 కోట్లకు లెక్కలు దొరకడంలేదని బుగ్గన వ్యాఖ్యానించారు. టీడీపీ నేత పయ్యావుల కాస్త ఓపిక పట్టాలని హితవు పలికారు. ఈ వ్యవహారం కోర్టు తేల్చిన తర్వాత పయ్యావుల మాట్లాడితే బాగుంటుందని అన్నారు. 

స్కిల్ కేసులో ఒక్క ఆధారం కూడా లేదని టీడీపీ నేతలు అంటున్నారని, న్యాయస్థానానికి ఆధారాలు చూపించామో లేదో వీళ్లకు తెలుసా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాలు ఎవరికి ఇవ్వాలో వారికే ఇస్తారు తప్ప బహిరంగంగా ప్రదర్శించరని తెలిపారు.

More Telugu News