Pig Heart Transplant: పంది గుండె అమర్చిన హృద్రోగి మృతి

  • హార్ట్ ఫెయిల్ అయిన అమెరికా రోగికి సెప్టెంబర్‌లో పంది గుండె అమర్చిన వైద్యులు
  • యూనివర్సిటీ ఆఫ్ మెరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ వైద్యుల నేతృత్వంలో ఆపరేషన్
  • శస్త్రచికిత్స జరిగిన తొలి రోజుల్లో వేగంగా మెరుగుపడ్డ రోగి ఆరోగ్యం
  • తరువాతి రోజుల్లో ఆర్గాన్ రిజెక్షన్ తలెత్తి రోగి మృతి చెందాడని వైద్యుల వెల్లడి
US Man Dies 40 Days After Receiving Worlds Second Pig Heart Transplant

హార్ట్ ఫెయిల్యూర్‌కు చికిత్సగా వైద్యులు పంది గుండెను అమర్చిన అమెరికా వ్యక్తి లారెన్స్ ఫాసెట్ (58) దురదృష్టవశాత్తూ మరణించారు. వైద్యులు ఆపరేషన్ చేసిన 40 రోజుల తరువాత ఆయన మృతిచెందారు. ఫాసెట్ గుండె పూర్తిగా విఫలం కావడంతో యూనివర్సిటీ ఆఫ్ మెరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ వైద్యులు ప్రయోగాత్మకంగా సెప్టెంబర్ 20న ఫాసెట్‌కు ఆపరేషన్ నిర్వహించి పంది గుండె అమర్చారు. మనిషికి అనుకూలంగా జన్యుమార్పిడి చేసిన పంది నుంచి ఈ గుండెను సేకరించారు. 

కాగా, ఆపరేషన్ జరిగిన తొలినాళ్లల్లో ఫాసెట్ ఆరోగ్యం వేగంగా మెరుగుపడిందని వైద్యులు తెలిపారు. ఆ తరువాతి రోజుల్లో పంది గుండెను ఫాసెట్ రోగనిరోధక వ్యవస్థ తిరస్కరించడం (ఆర్గాన్ రిజెక్షన్) ప్రారంభించిందని వెల్లడించారు. ఆయనను కాపాడేందుకు తాము ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని విచారం వ్యక్తం చేశారు. గుండె మార్పిడి శస్త్రచికిత్స తరువాత రోగులు ఎదుర్కొనే ప్రధాన సమస్య ఆర్గాన్ రిజెక్షన్ అన్న విషయం తెలిసిందే. ఈ సమస్యను అధిగమించేందుకు శాస్త్రవేత్తలు అనేక కోణాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు.

More Telugu News