శాంసంగ్ ఫోన్ వాడుతున్నారా.. మీకోసం కంపెనీ అదిరిపోయే ఆఫర్ ఇదిగో!

  • 2020 కన్నా ముందు మోడల్ ఫోన్ ను 5జీ ఫోన్ తో అప్ గ్రేడ్ చేసుకునే అవకాశం
  • కొత్త ఫోన్ పై భారీగా డిస్కౌంట్ కూడా అందిస్తున్న శాంసంగ్
  • లాయల్టీ అప్ గ్రేడ్ కింద ‘అప్ గ్రేడ్ టు ఆసమ్’ పోగ్రామ్
శాంసంగ్ కంపెనీ తన లాయల్ కస్టమర్ల కోసం సరికొత్త ఆఫర్ ప్రకటించింది. ‘అప్ గ్రేడ్ టు ఆసమ్’ పేరుతో ఎక్స్చేంజ్ ఆఫర్ ప్రకటించడంతో పాటు భారీగా డిస్కౌంట్ కూడా ప్రకటించింది. 2020 కన్నా ముందున్న శాంసంగ్ ఫోన్ వినియోగదారుల కోసం ఈ ఆఫర్ తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ‘ఏ’ సిరీస్ 5 జీ ఫోన్లపై డిస్కౌంట్ తో పాటు శాంసంగ్ కేర్ ప్రొటెక్షన్ ను ఉచితంగా కల్పిస్తోంది. స్క్రీన్ ప్రొటెక్షన్ ప్యాక్ కూడా ఫ్రీగా అందిస్తోంది. తమ కంపెనీ పాత ఫోన్లు వాడుతున్న వినియోగదారులు 5జీ ఫోన్ కు అప్ గ్రేడ్ అయ్యేందుకు వీలుకల్పించేలా ఈ ప్రోగ్రాం తీసుకొచ్చినట్లు తెలిపింది. కొత్త ఫోన్ పై వడ్డీలేని ఈఎంఐ సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు పేర్కొంది.

పాత ఫోన్లను గెలాక్సీ ఏ14, ఏ23, ఏ34, ఏ54 మోడల్ ఫోన్లతో మార్చుకోవచ్చని శాంసంగ్ ప్రకటించింది. ఏ14 మోడల్ (4జీబీ 64 జీబీ) ధర ప్రస్తుతం రూ.18,449 కాగా ఈ ఆఫర్ లో రూ.14,499 లకే సొంతం చేసుకోవచ్చని చెప్పింది. అదేవిధంగా రూ.28,990 లు గా ఉన్న గెలాక్సీ ఏ23 మోడల్ 5జీ ఫోన్ (6జీబీ 128 జీబీ) ఫోన్ ను కేవలం రూ.18,999 లకే అందిస్తామని, రూ.1,407 లతో నెలవారీ ఈఎంఐ సదుపాయం కూడా ఉందని వెల్లడించింది. ఇక, ఏ34 (8జీబీ 128 జీబీ) మోడల్ ధర రూ.35,499 లు కాగా దీనిని కేవలం రూ.25,999 లకే కొనుగోలు చేయొచ్చని శాంసంగ్ కంపెనీ తెలిపింది.

శాంసంగ్ ఏ54 మోడల్ 5జీ (8జీబీ 128 జీబీ) ఫోన్ ను రూ.33,999లకే సొంతం చేసుకోవచ్చని చెప్పింది. ఈ మోడల్ ఫోన్ ధర ప్రస్తుతం రూ.41,999 లుగా ఉందని కంపెనీ వెల్లడించింది. మీ పాత ఫోన్ లో మై గెలాక్సీ యాప్ లో ఈ ఆఫర్ పూర్తి వివరాలు, అప్ గ్రేడ్ చేసుకునే విధానం సహా పూర్తి వివరాలు ఉంటాయని శాంసంగ్ కంపెనీ తెలిపింది.



More Telugu News

Samsung Mobiles galaxy business Upgrade to Awesome loyalty program Galaxy A series