Cricket: ఆటకు ముందు బిర్యానీలు, కబాబ్‌లు లాగించేసి.. బాగా తింటున్నారని విమర్శించినవారి నోళ్లు మూయించిన పాకిస్థాన్ జట్టు!

  • కోల్ కతాలోని జూమ్ జూమ్ రెస్టారెంట్ కు ఆర్డర్ 
  • బిర్యానీలు, కబాబ్‌లు, చాప్‌లు తెప్పించుకొని తిన్న ఆటగాళ్లు
  • ఆదివారం రాత్రి 7 గంటల తర్వాత ఆర్డర్ చేశారన్న రెస్టారెంట్ డైరెక్టర్  
Pakistan shut their diet critics with beating Bangladesh in Kolkata

భారత్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్‌ 2023లో పాకిస్థాన్ వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో ఆ జట్టుపై తీవ్రమైన విమర్శలు వ్యక్తమైన విషయం తెలిసిందే. బ్యాటింగ్‌, బౌలింగ్‌తోపాటు ఫీల్డింగ్‌లో కూడా విఫలమవ్వడంతో ఫ్యాన్స్ తో పాటు ఆ దేశ క్రికెట్ దిగ్గజాలు తప్పుబట్టారు. ముఖ్యంగా మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ స్పందిస్తూ.. జట్టులోని ఆటగాళ్లు 8 కిలోల మటన్‌ తింటున్నారని, ఫిట్‌నెస్‌పై వారు ఏమాత్రం శ్రద్ధ తీసుకోవడం లేదంటూ ఆరోపించాడు. ఈ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో పాక్ ఆటగాళ్లగా బాగా ట్రోలింగ్ కూడా చేశారు. అయితే కోల్‌కతాలో బంగ్లాదేశ్‌పై విజయంతో పాక్ ఆటగాళ్లు విమర్శకుల నోళ్లు మూయించారు.

విమర్శలను పక్కనపెట్టి కోల్‌కతాలో మ్యాచ్‌కు ఒక రోజు ముందు  బిర్యానీలు, కబాబ్‌లు, చాప్‌లను తెప్పించుకుని పాక్ ఆటగాళ్లు ఆరగించారు. ఆహారానికి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కోల్‌కతాలో జామ్ జామ్ రెస్టారెంట్ నుంచి ఈ ఆహారాన్ని తెప్పించుకుని తిన్నారు. కెప్టెన్ బాబర్ ఆజమ్‌తోపాటు ఇతర ఆటగాళ్లు ఆదివారం సాయంత్రం ఈ ఫుడ్‌ని లాగించారు. జూమ్ జూమ్ రెస్టారెంట్ డైరెక్టర్ షాద్‌మాన్ ఫైజ్ ఈ విషయాన్ని నిర్ధారించారు. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఆర్డర్ వచ్చిందని, ఈ ఆర్డర్ పాకిస్తాన్ క్రికెట్ జట్టు నుంచి వచ్చిందని తమకు తర్వాత తెలిసిందని చెప్పారు. బిర్యానీ, కబాబ్‌లు, చాప్ అనే మూడు రకాల వంటకాలను ఆర్డర్ చేశారని వెల్లడించారు. ఆదివారం రాత్రి 7 గంటల తర్వాత ఆర్డర్ చేశారని, ఫుడ్ వాళ్లకు నచ్చే ఉంటుందని భావిస్తున్నట్టు పేర్కొన్నాడు. 

కాగా బంగ్లాదేశ్‌పై ఘనవిజయం ద్వారా ఆహారంతో ముడిపెట్టిన విమర్శించినవారి నోళ్లను పాక్ ఆటగాళ్లు మూయించినట్టయ్యింది. మంగళవారం ఈడెన్ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించడంతో ఆటగాళ్లు సెమీస్ అవకాశాలను ఇంకా సజీవంగానే ఉంచుకున్నారు.

More Telugu News