Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. కారణం ఇదే!

  • 237 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 61 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 2.59 శాతం పతనమైన ఎం అండ్ ఎం షేరు విలువ
Markets ends in losses

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. రెండు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. కీలక వడ్డీ రేట్లపై అమెరికా ఫెడ్ రిజర్వ్ రేపు నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 237 పాయింట్లు నష్టపోయి 63,874కి పడిపోయింది. నిఫ్టీ 61 పాయింట్లు కోల్పోయి 19,079 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టైటాన్ (2.47%), కోటక్ బ్యాంక్ (1.17%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (0.97%), ఏసియన్ పెయింట్స్ (0.97%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (0.65%). 

టాప్ లూజర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (-2.59%), సన్ ఫార్మా (-2.39%), భారతి ఎయిర్ టెల్ (-1.18%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.01%), రిలయన్స్ (-0.99%).

More Telugu News