Job notification: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలు.. 3 వేల పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్

  • టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్న ప్రభుత్వం
  • రాష్ట్రంలోని 18 యూనివర్సిటీలలో ఖాళీల భర్తీ
  • యూనివర్సిటీల చరిత్రలో 17 ఏళ్లలో ఇదే భారీ నోటిఫికేషన్
APPSC Job Notification released

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. యూనివర్సిటీల చరిత్రలో పదిహేడేళ్లలోనే భారీ నోటిఫికేషన్ ను ఏపీపీఎస్సీ తాజాగా జారీ చేసింది. రాష్ట్రంలోని 18 యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న 3,220 పోస్టుల భర్తీకి ప్రాసెస్ మొదలు పెట్టింది. టీచింగ్, నాన్ టీచింగ్ విభాగాల్లోని ఈ ఖాళీలను భర్తీ చేయడానికి అర్హుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. ఈ రోజు (అక్టోబర్ 31) నుంచే ఆన్ లైన్ లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. కాగా, అభ్యర్థుల ఎంపిక స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా పారదర్శకంగా జరపనున్నట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది. కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వారికి గరిష్ఠంగా 10 మార్కుల వెయిటేజ్ ఇవ్వనున్నట్లు పేర్కొంది.

పోస్టుల వివరాలు..
ప్రొఫెసర్ - 418
అసోసియేట్ ప్రొఫెసర్ - 801
అసిస్టెంట్ ప్రొఫెసర్ -2001

దరఖాస్తు ఫీజు..
అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టు (ఓపెన్‌ కేటగిరీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు) రూ.2,500,  ఎస్సీ, ఎస్టీ, పీబీడీలు అభ్యర్థులు రూ.2 వేలు 
ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు.. రూ.3 వేలు (అన్ని కేటగిరీల అభ్యర్థులు)

ప్రవాస భారతీయులు..
ప్రొఫెసర్‌ పోస్టులు: రూ.150 డాలర్లు (రూ.12,600)
అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు: 100 డాలర్లు (రూ.8,400)
అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు: ప్రవాస భారతీయులు 50 డాలర్లు (రూ.4.200) 

దరఖాస్తు విధానం..
దరఖాస్తు ఫీజు చెల్లించి ఆన్ లైన్ లో నవంబర్ 20 లోగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు కాపీని ఉన్నత విద్యామండలికి పోస్ట్ ద్వారా 27 వ తేదీలోపు పంపించాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టు స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలను నవంబర్ 30న ప్రకటించి, డిసెంబర్ 8న అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.

More Telugu News