Chandrababu: చంద్రబాబుకు హైకోర్టు విధించిన షరతులు ఇవే.. జడ్జిమెంట్ కాపీ ఇదిగో!

AP High Court conditions for Chandrababu in interim bail
  • స్కిల్ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు
  • సాక్షులను ప్రభావితం చేయకూడదంటూ హైకోర్టు షరతు
  • నచ్చిన ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవచ్చన్న హైకోర్టు
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఊరటను కల్పించిన సంగతి తెలిసిందే. నాలుగు వారాల పాటు ఆయనకు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. బెయిల్ మంజూరు చేయడంతో పాటు ఆయనకు పలు షరతులు విధించింది. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో టీడీపీ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. అన్ని చోట్ల సంబరాలు మొదలయ్యాయి. 

చంద్రబాబుకు హైకోర్టు విధించిన షరతులు:
  • రూ. 1 లక్ష విలువైన బెయిల్ బాండ్ (పూచీకత్తు)తో పాటు 2 ష్యూరిటీలు సమర్పించాలి. 
  • ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ కేసును ప్రభావితం చేసే చర్యలు చేపట్టకూడదు. సాక్షులను, కేసుకు సంబంధించిన వ్యక్తులను ప్రభావితం చేయకూడదు.
  • నచ్చిన ఆసుపత్రిలో సొంత ఖర్చుతో చంద్రబాబు చికిత్స చేయించుకోవచ్చు.
  • బెయిల్ ముగిసిన తర్వాత సరెండర్ సమయంలో ఆసుపత్రి, చికిత్స వివరాలను సీల్డ్ కవర్ లో జైలు సూపరింటెండెంట్ కు అందించాలి.
  • నవంబర్ 28న సాయంత్రం 5 గంటల్లోపు సరెండర్ కావాలి.
Chandrababu
bail
AP High Court
conditions

More Telugu News