బిస్కెట్లు దొంగిలించారని.. నలుగురు చిన్నారులపై దారుణం

  • బీహార్‌లోని బెగుసరాయ్ జిల్లాలో ఘటన
  • వీడియో వైరల్ కావడంతో వెలుగులోకి ఘటన
  • ఇది తీవ్రమైన నేరమన్న పోలీసులు
కుర్‌కురే, బిస్కెట్ ప్యాకెట్లను దొంగిలించారని ఆరోపిస్తూ నలుగురు చిన్నారులను స్తంభానికి కట్టేసి చావబాదారు. బీహార్‌లోని బెగుసరాయ్ జిల్లా ఫాజిల్‌పూర్ గ్రామంలో ఈ నెల 28న జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వీడియో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు దుకాణ యజమానిపై కేసు నమోదు చేశారు. 

వీడియో ప్రకారం.. నలుగురు చిన్నారులను ఓ స్తంభానికి కట్టేశారు. వారి చుట్టూ పెద్ద సంఖ్యలో జనం గుమికూడారు. దుకాణం నుంచి బిస్కెట్ ప్యాకెట్లు దొంగతనం చేయడం వల్లే దుకాణ యజమాని వారిని కట్టేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. పిల్లలను కట్టేసి, వారిని కొట్టడం సరికాదని పోలీసులు తెలిపారు. పిల్లల తల్లిదండ్రులను కలిసి దుకాణ యజమానిపై ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పామని, కానీ వారింత వరకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు. పిల్లలపై ఇలా వ్యవహరించడం తీవ్రమైన నేరమని హెచ్చరించారు.


More Telugu News

Bihar Crime News Begusarai Viral Videos