నేడు నల్గొండ జిల్లాలో మూడు సభల్లో పాల్గొననున్న సీఎం కేసీఆర్
- సభలు, సమావేశాలతో ప్రచారాన్ని హోరెత్తిస్తోన్న బీఆర్ఎస్
- నేడు హుజూర్‌నగర్, మిర్యాలగూడ, దేవరకొండ నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు
- సభలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి
మరోవైపు కీలక మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ కూడా ముమ్మరంగా ప్రచారాన్ని సాగిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఎమ్మెల్యేలు, అభ్యర్థులు సీఎం కేసీఆర్ బహిరంగ సభలను ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. సీఎం పర్యటన షెడ్యూల్ ఇప్పటికే వెల్లడికావడంతో సభకు సంబంధించిన ఏర్పాట్లు, జనసమీకరణపై దృష్టిపెడుతున్నారు.