Babar Azam: కోహ్లీ, రోహిత్ శర్మల్లో నాకు బాగా నచ్చింది ఇదే!: బాబర్ అజామ్

Babar Azam says he likes Kohli and Rohit Sharma for their grit
  • ప్రపంచ బెస్ట్ బ్యాట్స్ మన్లలో ఒకడిగా ఖ్యాతి పొందిన బాబర్ అజామ్
  • కోహ్లీ, రోహిత్, విలియమ్సన్ ల ఆట తనకు బాగా నచ్చుతుందని బాబర్ వెల్లడి
  • పరిస్థితులను అంచనా వేయడంలో వాళ్ల తర్వాతే ఎవరైనా అని వ్యాఖ్యలు
ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్ మన్లు ఎవరో చెప్పమంటే, వారిలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ తప్పకుండా ఉంటాడు. అలాంటి బాబర్ అజామ్ ప్రపంచ క్రికెట్లో ఎక్కువగా ఎవరిని అభిమానిస్తాడో తెలుసా... విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేన్ విలియమ్సన్ లనే. ఈ విషయం బాబరే స్వయంగా చెప్పాడు. 

పైగా, వాళ్లనే తాను ఎందుకు అభిమానిస్తాడో కూడా వెల్లడించాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు వీళ్లు ఎంతో నిబ్బరంగా ఆడి, జట్టును కష్టాల నుంచి గట్టెక్కిస్తుంటారని, వీరిలో ఉండే ఆ లక్షణమే తనకు బాగా నచ్చుతుందని బాబర్ అజామ్ తెలిపాడు. బ్యాటింగ్ కు దిగాక పరిస్థితులను అంచనా వేయడంలో వారిని మించిన వాళ్లు లేరని, తాను కూడా వారి నుంచి నేర్చుకోవాలనుకునేది ఆ అంశాన్నే అని వివరించాడు. 

ఇటీవల కొన్ని మ్యాచ్ ల్లో పేలవ ఫామ్ కనబర్చిన బాబర్ అజామ్... మొన్న దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో అర్ధ సెంచరీ సాధించి మళ్లీ టచ్ లోకి వచ్చాడు.
Babar Azam
Virat Kohli
Rohit Sharma
Kane Williamson
Pakistan
Team India
New Zeland
World Cup

More Telugu News