దుబాయ్ లో గంగవ్వ క్రేజ్ మామూలుగా లేదుగా.. మీరే చూడండి!
- బతుకమ్మ సంబరాల కోసం దుబాయ్ వెళ్లిన మై విలేజ్ షో టీం
- గంగవ్వను చూసేందుకు పోటెత్తిన వేలమంది
- చాలా మంది వెనుదిరిగి వెళ్లిపోయారన్న నిర్వాహకులు
స్టేడియంలోకి గంగవ్వ ఎంటరవుతుంటే ఈలలు చప్పట్లతో ఆమెకు స్వాగతం లభించింది. గంగవ్వతో సెల్ఫీ దిగేందుకు జనం ఎగబడ్డారు. వారిని కంట్రోల్ చేయడానికి నిర్వాహకులు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇదంతా చూస్తూ పక్కనే ఉన్న అనిల్ గీలా.. దుబాయ్ లో గంగవ్వకు ఇంత క్రేజ్ ఉంటుందని అనుకోలేదని చెప్పాడు.
బతుకమ్మ సంబరాల కోసం మై విలేజ్ షో టీమ్ దుబాయ్ చేరుకుంది. టీమ్ లోని అనిల్, రాజు, శ్రీకాంత్, గంగవ్వ తదితరులు దుబాయ్ లోని పర్యాటక ప్రాంతాలను చుట్టి వచ్చారు. బుర్జ్ ఖలీఫా ముందు ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఈ ఫొటోలకు నెటిజన్ల స్పందన కూడా ఎక్కువగా ఉంది. ‘ఎక్కడి లంబాడి పల్లి.. ఎక్కడి దుబాయ్.. హ్యాట్సాఫ్ గంగవ్వ’ అంటూ ఓ నెటిజన్ పెట్టిన కామెంట్ కు వందలాది మంది లైక్ లు కొడుతున్నారు.