దుబాయ్ లో గంగవ్వ క్రేజ్ మామూలుగా లేదుగా.. మీరే చూడండి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దుబాయ్ లో గంగవ్వ క్రేజ్ మామూలుగా లేదుగా.. మీరే చూడండి!

Gangavva Visits Dubai Along with My Village Show Team
  • బతుకమ్మ సంబరాల కోసం దుబాయ్ వెళ్లిన మై విలేజ్ షో టీం
  • గంగవ్వను చూసేందుకు పోటెత్తిన వేలమంది
  • చాలా మంది వెనుదిరిగి వెళ్లిపోయారన్న నిర్వాహకులు
యూట్యూబ్ సెలబ్రిటీ గంగవ్వకు దుబాయ్ లో వేలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇటీవల అక్కడ జరిగిన బతుకమ్మ సంబరాల కోసం గంగవ్వ దుబాయ్ వెళ్లగా.. ఆమెను చూడడానికి దుబాయ్ లో ఉంటున్న తెలుగు వాళ్లు పోటెత్తారు. కార్యక్రమం నిర్వహించిన హాల్ కెపాసిటీకి మించి జనం రావడంతో గందరగోళం నెలకొంది. ఓ దశలో నిర్వాహకులు కూడా తామేం చేయలేమంటూ చేతులెత్తేశారు. బతుకమ్మలతో వచ్చిన చాలామంది ఆడపడుచులు తిరిగి వెళ్లిపోయారంటూ నిర్వాహకులలో ఒకరు కన్నీరు పెట్టుకున్నారు.

స్టేడియంలోకి గంగవ్వ ఎంటరవుతుంటే ఈలలు చప్పట్లతో ఆమెకు స్వాగతం లభించింది. గంగవ్వతో సెల్ఫీ దిగేందుకు జనం ఎగబడ్డారు. వారిని కంట్రోల్ చేయడానికి నిర్వాహకులు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇదంతా చూస్తూ పక్కనే ఉన్న అనిల్ గీలా.. దుబాయ్ లో గంగవ్వకు ఇంత క్రేజ్ ఉంటుందని అనుకోలేదని చెప్పాడు. 

బతుకమ్మ సంబరాల కోసం మై విలేజ్ షో టీమ్ దుబాయ్ చేరుకుంది. టీమ్ లోని అనిల్, రాజు, శ్రీకాంత్, గంగవ్వ తదితరులు దుబాయ్ లోని పర్యాటక ప్రాంతాలను చుట్టి వచ్చారు. బుర్జ్ ఖలీఫా ముందు ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఈ ఫొటోలకు నెటిజన్ల స్పందన కూడా ఎక్కువగా ఉంది. ‘ఎక్కడి లంబాడి పల్లి.. ఎక్కడి దుబాయ్‌.. హ్యాట్సాఫ్‌ గంగవ్వ’ అంటూ ఓ నెటిజన్ పెట్టిన కామెంట్ కు వందలాది మంది లైక్ లు కొడుతున్నారు.

Advertisement
Gangavva
Dubai Tour
My village show
Burj khalifa
Entertainment
gangavva craze

More Telugu News