CBN Gratitude Concert: రేపు హైదరాబాదులో సీబీఎన్ గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్ కు సర్వం సిద్ధం

  • సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్న హైటెక్ సిటీ
  • చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపేందుకు కాన్సెర్ట్ నిర్వహిస్తున్న ఐటీ ఉద్యోగులు
  • గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో భారీ ఏర్పాట్లు
All set for CBN Gratitude Concert in Hyderabad tomorrow

టీడీపీ అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపేందుకు హైదరాబాదులో రేపు (అక్టోబరు 29) సీబీఎన్ గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియం వేదికగా నిలవనుంది. హైటెక్ సిటీ సిల్వర్ జూబ్లీ నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు చంద్రబాబుకు కృతజ్ఞతగా ఈ భారీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటలకు ఈ కాన్సెర్ట్ జరగనుంది. ఈ కార్యక్రమానికి లక్ష మంది వరకు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో, గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. స్టేడియం చుట్టూ భారీ ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. తెలుగు ఐటీ నిపుణుల టీమ్ ఈ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించింది.

More Telugu News