KA Paul: పవన్ కల్యాణ్ కంటే నేనే బెటర్ అని వైసీపీ ఎంపీ చెప్పారు: కేఏ పాల్

Vizag YSRCP MP said I am better than Pawan Kalyan says KA Paul
  • తాను విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తానన్న కేఏ పాల్
  • తెలంగాణ ప్రజలు కూడా తనను కోరుకుంటున్నారని వ్యాఖ్య
  • వచ్చే నెల 9న 200 దేశాలకు క్రిస్మస్ సందేశాన్ని ఇవ్వబోతున్ననని వెల్లడి

తాను విశాఖపట్నం స్థానం నుంచి ఎంపీగా పోటీ చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. ఎంపీగా పోటీ చేయబోతున్న తనకు అన్ని వర్గాల ప్రజల మద్దతు ఉందని చెప్పారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కంటే తానే బెటర్ అని విశాఖ వైసీపీ ఎంపీ ఎంవీవీ చెప్పారని అన్నారు. వచ్చే నెల 9వ తేదీన విశాఖలో గ్లోబల్ క్రిస్మస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని... 200 దేశాలకు ఇక్కడి నుంచి సందేశాన్ని ఇవ్వబోతున్నానని చెప్పారు. ఆ రోజున కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని, భోజనం చేసి వెళ్లాలని చెప్పారు. తెలంగాణ ప్రజలు కూడా తనను కోరుకుంటున్నారని... కేసీఆర్ పాలన పోయి, కేఏ పాల్ పాలన రావాలని ఆకాంక్షిస్తున్నారని అన్నారు.

  • Loading...

More Telugu News