Breakfast: ఆరోగ్యానికి బూస్ట్ ఇచ్చే చక్కని బ్రేక్ ఫాస్ట్ ఇలా వుండాలి!

  • ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం తప్పనిసరి అంటున్న నిపుణులు
  • చక్కటి బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటే రోజంతా ఎనర్జీతో ఉండొచ్చని వెల్లడి
  • హెల్దీగా, బ్యాలెన్స్ డ్ గా ఉండేలా చూసుకోవాలని సూచన
Best Healthy Breakfast Foods to Eat

రోజంతా ఫుల్ ఎనర్జీతో, జోష్ గా ఉండాలంటే ఉదయాన్నే మంచి అల్పాహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రోజు మొత్తమ్మీద బ్రేక్ ఫాస్ట్ కు అత్యంత ప్రాముఖ్యత ఉందని అంటున్నారు. సరైన బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చని, బరువు పెరుగుతామనే చింత అక్కర్లేదని వివరించారు. ఒకవేళ బ్రేక్ ఫాస్ట్ ను ఎగ్గొడుతుంటే మాత్రం అధిక బరువుతో ఇబ్బంది పడే ప్రమాదం ఉందని, శరీరానికి సరైన పోషకాలు అందవని హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో అల్పాహారంలో సరైన పోషకాలు ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.

  • ఫైబర్ కార్బోహైడ్రేట్లతో నిండిన, ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలతో బ్రేక్ ఫాస్ట్ బ్యాలెన్స్ డ్ గా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం వారు కొన్ని ఆహార పదార్థాలను సూచిస్తున్నారు. వీటిని మీ రోజువారీ అల్పాహారంలో చేర్చుకుంటే ఆరోగ్యంగా, హుషారుగా ఉండొచ్చని చెబుతున్నారు. అవేంటంటే.. స్వీట్ పొటాటోను ఉడికించి, పీనట్ బటర్ తో కలిపి తీసుకోవడం ఆరోగ్యకరమని అంటున్నారు. దీనికి తోడుగా కొన్ని యాపిల్ ముక్కలను చేర్చుకోవాలని చెబుతున్నారు.
  • ఆల్మండ్ మిల్క్ లో ఓట్స్, చియా గింజలను, పీనట్ బటర్ కలిపి రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తీసుకోవాలని సూచిస్తున్నారు.
  • అల్పాహారంలో పప్పు ధాన్యాలను చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా పదిలంగా ఉంటుందని, జీర్ణక్రియ సాఫీగా సాగుతుందని, శరీరంలోని అదనపు బరువును వదిలించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
  • శరీరానికి కావాల్సిన ఫైబర్, ఐరన్ లతో పాటు ప్రొటీన్ అందించేందుకు చక్కటి మార్గం అల్పాహారంలో క్వినోవాకు చోటివ్వడమే.. దీనికి తోడుగా సిట్రస్ లేదా బెర్రీ పళ్లను చేర్చుకుంటే రోజంతా ఎనర్జీతో ఉండొచ్చట.
  • బ్లడ్ షుగర్ నియంత్రణ, కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి ఓట్ మీల్ బాగా ఉపయోగపడుతుందని హెల్త్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. ఉదయాన్నే ఓట్ మీల్ తీసుకోవడం వల్ల చాలాసేపు పొట్ట నిండుగా ఉంటుందని, ఆకలి వేయదని వివరించారు. శరీరానికి కావాల్సిన పోషకాలకు ఇందులో ఢోకా ఉండదని తెలిపారు.
  • వీటితో పాటు కెఫిర్ స్మూతీ, అవకాడో టోస్ట్, టోఫూ స్క్రాంబుల్, గ్రీక్ యోగర్ట్ పార్ఫైట్, గ్రీక్ యోగర్ట్ తో పాటు పాన్ కేక్స్ లను బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే చక్కటి ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

More Telugu News