Jr NTR: 'దేవర' కోసం గోవా వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్

Jr NTR leaves for Goa to join Devara shooting
షార్ట్స్‌లో చూడండి
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న హైఓల్టేజ్ యాక్షన్ చిత్రం 'దేవర'. ఇందులో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. విలన్ గా బాలీవుడ్ అగ్రహీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండడం విశేషం. 

కాగా, దేవర తాజా షెడ్యూల్ షూటింగ్ గోవాలో జరుగుతోంది. హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ షెడ్యూల్ కోసం గోవా వెళ్లాడు. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ఎన్టీఆర్ కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఈ  షెడ్యూల్ లో హీరోయిన్ జాన్వీ కపూర్ పై పలు సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. 

గోవా షెడ్యూల్ ముగిసిన అనంతరం గోకర్ణంలో భారీ సెట్టింగ్ లతో షూటింగ్ జరపనున్నారు. దేవర చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Go Back to Shorts
Jr NTR
Devara
Goa
Koratala Siva
Tollywood

More Telugu News