Police: ఢిల్లీలో తనిఖీ నిర్వహిస్తున్న పోలీసును ఢీకొట్టిన ఎస్ యూవీ... ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఇదిగో!

  • కన్నాట్ ప్లేస్ లో ఘటన
  • రోడ్డుపై కారును ఆపి పత్రాలు తనిఖీ చేస్తున్న పోలీసు
  • అదే సమయంలో అటుగా వచ్చిన ఎస్ యూవీ
  • నేరుగా పోలీసును ఢీకొట్టిన వైనం
SUV hits police in Delhi

ఢిల్లీలో విధి నిర్వహణలో ఉన్న ఓ పోలీసును ఎస్ యూవీ వాహనం ఢీకొట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నెల 24 రాత్రి ఢిల్లీలో ఓ పోలీసు కారును ఆపి పత్రాలు తనిఖీ చేస్తున్నాడు. అదే సమయంలో, అటుగా వచ్చిన ఓ ఎస్ యూవీ వాహనం నేరుగా పోలీసును గుద్దేసింది. ఈ తాకిడికి పోలీసు బారికేడ్లతో సహా ఎగిరి అవతలపడ్డాడు. గాయాలపాలైన ఆ కానిస్టేబుల్ ను ఆసుపత్రికి తరలించగా, చికిత్స అనంతరం డిశ్చార్జి అయ్యాడు. ఆ ఎస్ యూవీ డ్రైవర్ ను పోలీసులు చేజింగ్ చేసి పట్టుకున్నారు. అతడిపై చర్యలు తీసుకున్నారు. ఈ ఘటన ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ ఏరియాలో జరిగింది.

More Telugu News