USA: రూ. 15 లక్షలు కూడా ఖరీదు చేయని ఇల్లు.. రూ. 3 కోట్ల విలువ తెచ్చిన యువతి!

  • అమెరికాలో ఘటన
  • 2020లో 18 వేల డాలర్లకు ఇల్లు కొనుగోలు
  • ఆ తర్వాత ఇంటి స్వరూపాన్ని పూర్తిగా మార్చేసిన బెట్సీ స్వీనీ
  • ఇంటి పునర్నిర్మాణ పనులను ఇన్‌స్టాలో పంచుకున్న బెట్సీ
  • ఇప్పుడా ఇంటికి 3.75 లక్షల డాలర్లు పలుకుతుందని ఆశాభావం
US Woman Turns Rs 15 Lakh House Into Rs 3 Crore

ఆ ఇంటి ఖరీదు పట్టుమని రూ. 15 లక్షలు కూడా చెయ్యదు. కానీ, ఓ యువతి తన తెలివితో దానికి ఏకంగా రూ. 3 కోట్ల విలువను తీసుకొచ్చింది. కరోనా సమయంలో అంటే 2020లో అమెరికాకు చెందిన ఓ మహిళ 18 వేల డాలర్లకు ఓ ఇంటిని కొనుగోలు చేసింది. పాడుబడి ఎందుకూ పనికిరాకుండా పోయిన ఆ ఇంటిని ఆ తర్వాత సొంత తెలివితేటలతో అందంగా తీర్చిదిద్దింది. ఇప్పుడా ఇంటి ఖరీదు 3.75 లక్షల డాలర్లు. మన కరెన్సీలో చెప్పుకోవాలంటే రూ. 3,12,13,143 అన్నమాట. 

ఇంటి విలువను అమాంతం పెంచేసిన ఆమె పేరు బెట్సీ స్వీనీ. వయసు 30 సంవత్సరాలు. ఆర్కిటెక్చర్‌లో ఆమెకు అపారమైన అనుభవం ఉంది. 120 ఏళ్ల నాటి ఆ ఇంటిని కొనుగోలుచేసిన బెట్సీ 18 వేల డాలర్లు ఖర్చు చేసి ఇంటి రూపురేఖలను మార్చిపడేసింది. పాకెట్ డోర్స్, విక్టోరియన్ ఫైర్ ప్లేస్‌లు, పాతకాలపు బాత్‌టబ్ వంటివాటిని సంరక్షించడంతోపాటు పునర్నిర్మాణానికి లక్ష డాలర్లు ఖర్చు చేసింది. 

‘బిజినెస్ ఇన్‌సైడర్’ నివేదిక ప్రకారం.. ఆ ఇంటి కోసం బెట్సీ మొత్తం 1.60 లక్షల డాలర్లు ఖర్చు చేసింది. ఇంటి పునరుద్ధరణకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లలో షేర్ చేసింది. ఇప్పుడీ ఇంటిని తాను కనుక అమ్మకానికి పెడితే 2,40,000 డాలర్లకు లిస్ట్ చేస్తానని తెలిపింది. అయితే, ఉన్నతస్థాయిగా పరిగణించే పరిసరాల్లో తన ఇల్లు ఉండడంతో దానికి 3.75 లక్షల డాలర్ల ధర పలుకుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. 

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

More Telugu News