R Narayana Murthy: భారతదేశ యువత వారానికి 70 గంటలు పనిచేయాలి: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి

Narayana Murthy says indian Youth should work for 70 hours a week

  • ఇతర దేశాలతో పోటీ పడేందుకు భారతదేశ పని సంస్కృతిలో తక్షణ మార్పులు రావాలన్న మూర్తి
  • భారత దేశ ఉత్పాదకత తక్కువగా ఉందని విచారం
  • రెండో ప్రపంచ యుద్ధం తరువాత జపాన్, జర్మనీ దేశాలు ఇదే చేశాయని వెల్లడి
  • దేశం కోసం శ్రమిస్తామని యువత ప్రతినబూనాలని సూచన

ఇతర దేశాలతో సమానంగా అభివృద్ధి సాధించాలంటే భారతదేశ పని సంస్కృతిలో తక్షణ మార్పులు రావాలని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అభిప్రాయపడ్డారు. యువత కష్టపడేందుకు సిద్ధంగా ఉండాలని, వారానికి 70 గంటల పాటు పనిచేయాలని ఆయన సూచించారు. 3వన్4 క్యాపిటల్ తొలి పాడ్‌కాస్ట్ ‘ది రికార్డ్’ అనే ఎపిసోడ్‌లో నారాయణ మూర్తి పాల్గొన్నారు. 

ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో ఉత్పాదకత తక్కువగా ఉందని నారాయణ మూర్తి తెలిపారు. రెండో ప్రపంచయుద్ధం తరువాత జపాన్, జర్మనీ దేశాలు తమ పని సంస్కృతిలో మార్పులు చేసుకున్నాయని, యువత అధికసమయం పనికి కేటాయించేలా ప్రోత్సహించాయని తెలిపారు. చైనా వంటి దేశాలతో పోటీపడేందుకు ఇది అవసరమని చెప్పారు. ‘‘ఇది నా దేశం. నా దేశం కోసం వారానికి 70 గంటలు కష్టపడతాను’’ అని యువత ప్రతిజ్ఞ చేయాలని ఆయన సూచించారు.

R Narayana Murthy
Infosys
  • Loading...

More Telugu News