Hyderabad: హైదరాబాద్ లో పేలుళ్లకు కుట్ర కేసులో సయ్యద్ మక్బూల్ కు పదేళ్ల జైలుశిక్ష

  • 2013లో అరెస్టయిన సయ్యద్ మక్బూల్
  • మక్బూల్ కు ఇండియన్ ముజాహిదీన్ తో లింకులు
  • దోషిగా నిర్ధారించిన ఎన్ఐఏ కోర్టు
NIA Court sentences Syed Maqbool ten years imprisonment

హైదరాబాదులో పేలుళ్ల కుట్రకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇండియన్ ముజాహిదిన్ ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ కు శిక్ష పడింది. ఢిల్లీలోని ఎన్ఐఏ కోర్టు అతనిని దోషిగా నిర్ధారిస్తూ పదేళ్ల జైలు శిక్ష విధించింది. దాంతో ఈ కేసులో శిక్ష పడిన వారి సంఖ్య ఐదుకి పెరిగింది. ఈ కేసులో ఎన్ఐఏ 11 మందిని అరెస్ట్ చేయగా, నలుగురికి ఇదివరకే శిక్ష పడింది. 

సయ్యద్ మక్బూల్ స్వస్థలం మహారాష్ట్రలోని నాందేడ్. హైదరాబాదులో పేలుళ్లకు కుట్ర పన్నాడన్న ఆరోపణలపై అతడిని 2013 ఫిబ్రవరి 28న అరెస్ట్ చేశారు. పాకిస్థాన్, భారత్ లోని ఇండియన్ ముజాహిదిన్ ఉగ్రవాదులతో అతడు క్రియాశీలకంగా సంప్రదింపులు జరుపుతూ కుట్రలో భాగమయ్యాడని ఎన్ఐఏ తన చార్జిషీటులో పేర్కొంది.

More Telugu News