వరల్డ్ కప్: కీలక మ్యాచ్ లో శ్రీలంకపై టాస్ గెలిచిన ఇంగ్లండ్

England won the toss against Sri Lanka
  • వరల్డ్ కప్ లో నేడు ఇంగ్లండ్ × శ్రీలంక
  • బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
  • ఈ మ్యాచ్ లో ఓడితే ఇంగ్లండ్ సెమీస్ ఆశలు ఆవిరి!
  • లంక జట్టుదీ అదే పరిస్థితి!
గత వరల్డ్ కప్ విజేత, బజ్ బాల్ క్రికెట్ తో టెస్టుల్లోనూ వేగవంతమైన ఆటతో ఆకట్టుకునే ఇంగ్లండ్ ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో దారుణంగా ఆడుతోంది. 4 మ్యాచ్ లు ఆడి కేవలం ఒకే విజయంతో సెమీస్ అవకాశాలు సంక్లిష్టం చేసుకున్న ఇంగ్లండ్ నేడు శ్రీలంకతో కీలక మ్యాచ్ లో తలపడుతోంది. 

ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ ఓడితే సెమీస్ ఆశలు దాదాపు ఆవిరైనట్టే. అటు, శ్రీలంక పరిస్థితి కూడా ఇంతే! ఆ జట్టు కూడా 4 మ్యాచ్ లు ఆడి మూడింట్లో ఓడింది. ఇప్పుడీ రెండు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో నేడు ఇంగ్లండ్, శ్రీలంక మధ్య ఆసక్తికర సమరం జరగనుంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. 

సహజంగానే, భారీ స్కోరు సాధించాలనుకుంటున్న ఇంగ్లండ్ కు శ్రీలంక స్పిన్నర్లు అడ్డంకిగా పరిణమించే అవకాశం ఉంది. బెయిర్ స్టో, డేవిడ్ మలాన్, జో రూట్, జోస్ బట్లర్, బెన్ స్టోక్స్ వంటి హేమాహేమీ బ్యాట్స్ మెన్ ఉన్నప్పటికీ ఈ వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ తడబడుతోంది. 

ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టులోకి మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, లియామ్ లివింగ్ స్టన్ లను తీసుకున్నారు. పేసర్ రీస్ టాప్ లే చేతి వేలు విరగడంతో స్వదేశానికి వెళ్లిపోయాడు. పేసర్ గస్ ఆట్కిన్సన్, యువ బ్యాట్స్ మన్ హ్యారీ బ్రూక్ లను పక్కనబెట్టారు. 

శ్రీలంక జట్టులో సీనియర్ ఆల్ రౌండర్ ఏంజెలో మాథ్యూస్ కు చోటు కల్పించడం సానుకూలాంశం. పేసర్ లహిరు కుమార కూడా ఈ మ్యాచ్ లో ఆడుతున్నాడు.
Go Back to Shorts
World Cup
England
Sri Lanka
Toss
Bengaluru

More Telugu News