ఉయ్యూరులో ప్రమాదకరమైన నత్తల పెంపకం.. ఒక్కటి బయటపడ్డా పంటలు నాశనమే..!
- 50 సెంట్లలోని పంటను ఒకే ఒక నత్త నాశనం చేస్తుందంటున్న నిపుణులు
- థాయ్ లాండ్ నత్తలను దేశంలోకి తీసుకురావడంపై కేంద్రం బ్యాన్
- విశ్వశాంతి విద్యాసంస్థల ఆవరణలో పెంచుతున్న యజమాని
విశ్వశాంతి విద్యాసంస్థల ఆవరణలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ప్రత్యేకంగా ట్యాంకుల్లో పెంచుతున్న నత్తలను, పెంపకం పద్ధతులను పరిశీలించారు. అందులోని నత్తలు నిషేధిత జాబితాలోనివి కావడంతో కేసు నమోదు చేశారు. థాయ్ లాండ్ నుంచి వాటిని తీసుకువచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ప్రమాదకరమైన ఈ నత్తలను దేశంలోకి ఎలా తీసుకువచ్చారు..? సెక్యూరిటీ తనిఖీల నుంచి ఎలా తప్పించుకున్నారనే వివరాలు ఆరా తీస్తున్నారు. ఈ నత్తలను ఎందుకు పెంచుతున్నారు.. ఏ దేశానికి ఎగుమతి చేస్తారనేది కూడా విచారిస్తున్నారు. కాగా, ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు పోలీసు అధికారులు చెప్పారు.