DK Aruna: కాంగ్రెస్ లో చేరుతున్నారనే వార్తలపై డీకే అరుణ స్పందన

  • డీకే అరుణ బీజేపీకి గుడ్ బై చెపుతున్నారంటూ ప్రచారం
  • తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న అరుణ
  • మోదీ నాయకత్వంలో పని చేయాలంటే అదృష్టం ఉండాలని వ్యాఖ్య
DK Aruna response on party change

తెలంగాణలో బీజేపీ ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. మొన్నటి వరకు ఈ పార్టీలోకి పెద్ద పెద్ద నేతలు చేరారు. ఇప్పుడు కీలక నేతలు కొందరు పార్టీని వీడారు. బీజేపీని చాలా మంది నేతలు వీడబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతోంది. ఈ జాబితాలో మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూడా ఉన్నారని అంటున్నారు. 

తాజాగా ఈ వార్తలపై డీకే అరుణ స్పందించారు. తాను బీజేపీని వీడే ప్రసక్తే లేదని... కాంగ్రెస్ లో చేరే అవకాశమే లేదని చెప్పారు. తనపై కొందరు పనికట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ అధినాయకత్వం తనను గుర్తించి జాతీయ ఉపాధ్యక్ష పదవిని ఇచ్చిందని అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో పని చేయాలంటే అదృష్టం ఉండాలని చెప్పారు.

మరోవైపు, బీజేపీ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు ఆయన స్పష్టం చేశారు. నియంత కేసీఆర్ పాలనను అంతమొందించేందుకే తాను కాంగ్రెస్ లో చేరుతున్నానని ఆయన తెలిపారు.

More Telugu News