కెనడాలో కొన్ని వీసా సర్వీసులు పునరుద్ధరించిన భారత్
- అక్టోబర్ 26 నుంచి పాక్షిక సర్వీసులు పున:ప్రారంభం
- ఎంట్రీ వీసా, బిజినెస్, మెడికల్, కాన్ఫరెన్స్ వీసాల సర్వీసుల పునరుద్ధరణ
- కెనడాలోని ఇండియన్ హైకమిషన్ ప్రకటన
కాగా.. ఖలిస్థానీ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించిన విషయం తెలిసిందే. నిరాధార ఆరోపణలను భారత్ ఖండించడంతో ఇరు దేశాల మధ్య దౌత్య వివాదం ఏర్పడింది. ఈ ప్రభావంతో సెప్టెంబర్ చివరిలో వీసా సర్వీసులు నిలిపివేస్తున్నట్టు భారత్ ప్రకటించింది. ఇదిలావుండగా కెనడాలోని భారతీయ దౌత్యవేత్తల భద్రత విషయంలో పురోగతిని చూస్తుంటే కెనడాకు వీసా సేవలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆదివారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.