India: కెనడాలో కొన్ని వీసా సర్వీసులు పునరుద్ధరించిన భారత్

  • అక్టోబర్ 26 నుంచి పాక్షిక సర్వీసులు పున:ప్రారంభం
  • ఎంట్రీ వీసా, బిజినెస్, మెడికల్, కాన్ఫరెన్స్ వీసాల సర్వీసుల పునరుద్ధరణ
  • కెనడాలోని ఇండియన్ హైకమిషన్ ప్రకటన
India has restored some visa services in Canada

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య, అనంతర పరిణామాలతో దెబ్బతిన్న భారత్, కెనడా దౌత్యసంబంధాలు పునరుద్ధరణ దిశగా కీలక ముందడుగుపడింది. దాదాపు నెలక్రితం రద్దు చేసిన వీసా సర్వీసుల్లో కొన్నింటిని పునఃప్రారంభిస్తున్నట్టు కెనడాలోని ఇండియన్ హైకమిషన్ ప్రకటించింది. ఎంట్రీ వీసా, బిజినెస్ వీసా, మెడికల్ వీసా, కాన్ఫరెన్స్ వీసాల సేవలు తిరిగి మొదలవుతాయని తెలిపింది. అక్టోబర్ 26 నుంచి పాక్షికంగా ప్రారంభమవుతాయని వివరించింది. పరిస్థితులను పరిశీలించిన తర్వాత వాటి ఆధారంగా తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేసింది. 

కాగా.. ఖలిస్థానీ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించిన విషయం తెలిసిందే. నిరాధార ఆరోపణలను భారత్ ఖండించడంతో ఇరు దేశాల మధ్య దౌత్య వివాదం ఏర్పడింది. ఈ ప్రభావంతో సెప్టెంబర్ చివరిలో వీసా సర్వీసులు నిలిపివేస్తున్నట్టు భారత్ ప్రకటించింది. ఇదిలావుండగా కెనడాలోని భారతీయ దౌత్యవేత్తల భద్రత విషయంలో పురోగతిని చూస్తుంటే కెనడాకు వీసా సేవలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆదివారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

More Telugu News