ఎవరిష్టం వారిది.. రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై కిషన్ రెడ్డి
- ఆయనకు మంచి అవకాశం ఇచ్చామన్న కేంద్ర మంత్రి
- జాతీయ స్థాయిలో పదవి కట్టబెట్టామని వివరణ
- తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని వ్యాఖ్య
అయినా పార్టీ మారడం ఆయన వ్యక్తిగత నిర్ణయమని వివరించారు. అయితే, వ్యక్తిగత కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తూ ఆరోపణలు చేయడం సరికాదని చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయం కాబోదని రాజగోపాల్ రెడ్డి అన్నారు. బీజేపీకి రాజీనామా చేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిని కిషన్ రెడ్డి తప్పుబట్టారు. బీజేపీ పోటీలో లేదని వారు అనుకుంటే సరిపోతుందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనకు చెక్ పెట్టేది తామేనని కిషన్ రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. కాగా, పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో బుధవారం కిషన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ పెద్దలతో ఆయన భేటీ కానున్నారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, జనసేనతో పొత్తుపై ఈ భేటీలో చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.