Harish Rao: పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతోందో చూస్తున్నాం కదా!: హరీశ్ రావు

Harish Rao comments on neighbourhood states political developments
  • ఏపీ రాజకీయ పరిస్థితులపై హరీశ్ పరోక్ష వ్యాఖ్యలు
  • వీళ్లు గెలిస్తే వాళ్లను జైల్లో వేస్తారు... వాళ్లు గెలిస్తే వీళ్లను జైల్లో వేస్తారని వెల్లడి
  • కేసీఆర్ తలుచుకుంటే రేవంత్ ను జైల్లో వేసేవారని ఉద్ఘాటన
తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఏపీ రాజకీయ పరిస్థితులపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ కు పనితనం తప్ప పగతనం లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ తలుచుకుంటే రేవంత్ రెడ్డిని ఎప్పుడో జైలులో వేసేవారని అన్నారు. ఓటుకు నోటు కేసులో చర్యలు తీసుకుని ఉండేవారని తెలిపారు. పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతోందో చూస్తున్నాం కదా... వాళ్లు గెలవగానే వీళ్లను జైలుకు పంపిస్తారు... వీళ్లు గెలవగానే వాళ్లను జైలుకు పంపిస్తారు అని హరీశ్ రావు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 

గతంలో రేవంత్ సోనియాను బలి దేవత అన్నాడని, ఇప్పుడు దేవత అంటున్నాడని విమర్శించారు. రేవంత్ ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకం అని అన్నారు. తనది బీజేపీపై పోరాడే డీఎన్ఏ అంటున్న రాహుల్ గాంధీ... రేవంత్ రెడ్డి డీఎన్ఏ ఏమిటో తెలుసుకోవాలని హరీశ్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి డీఎన్ఏలు సరిపోలడం లేదని ఎద్దేవా చేశారు.
Harish Rao
KCR
BRS
Revanth Reddy
Rahul Gandhi
Congress
Telangana

More Telugu News