K Kavitha: ప్రపంచ ప్రఖ్యాత యూనివర్శిటీ నుంచి కవితకు ఆహ్వానం

  • ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ నుంచి కవితకు ఆహ్వానం
  • డెవలప్ మెంట్ ఎకనామిక్స్ పై ప్రసంగించనున్న కవిత
  • ఈ నెల 30న జరగనున్న కార్యక్రమం
Kavitha gets invitation from Oxford University

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బ్రిటన్ లోని ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ నుంచి ఆహ్వానం అందింది. 'డెవలప్ మెంట్' ఎకనామిక్స్ అనే అంశంపై ప్రసంగించాలంటూ ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ యాజమాన్యం కవితను ఆహ్వానించింది. ఈ కార్యక్రమం ఈ నెల 30న జరగనుంది. ఈ కార్యక్రమంలో కవిత తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై కీలకోపన్యాసం చేయనున్నారు. మరోవైపు ఇటీవల బ్రిడ్జ్ ఇండియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు కవిత లండన్ లో పర్యటించిన సంగతి తెలిసిందే.

More Telugu News