Israel: ఇజ్రాయెల్ విషయంలో స్టాండ్ మార్చిన చైనా

  • తొలుత పాలస్తీనాకు అనుకూలంగా మాట్లాడిన చైనా అధ్యక్షుడు
  • తాజాగా మాట మార్చిన చైనా
  • దేశాన్ని రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్ కు ఉందన్న చైనా విదేశాంగ మంత్రి
China changes stand on Israel

గాజాపై ఇజ్రాయెల్ ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలో పలు దేశాలు ఇజ్రాయెల్ కు అండగా నిలుస్తుండగా... మరి కొన్ని దేశాలు హమాస్ కు మద్దతుగా నిలుస్తున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ విషయంలో చైనా తన స్టాండ్ ను మార్చుకుంది. తమ దేశాన్ని రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్ కు ఉందని చైనా వ్యాఖ్యానించింది. స్వీయ రక్షణ అనేది ప్రతి దేశానికి ఉన్న హక్కు అని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ అన్నారు. దేశ ప్రజలను కాపాడుకోవడానికి ప్రతి దేశానికి హక్కు ఉంటుందని చెప్పారు. ఇజ్రాయెల్ కు అనుకూలంగా చైనా మాట్లాడటం ఇదే తొలిసారి. 

గత వారం చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మాట్లాడుతూ... ఇజ్రాయెల్ వెంటనే కాల్పులను విరమించాలని చెప్పారు. పాలస్తీనా సమస్యను పరిష్కరించేందుకు ఈజిప్ట్, ఇతర అరబ్ దేశాలతో కలిసి పని చేస్తామని అన్నారు. ఇప్పుడు చైనా తన స్టాండ్ ను మార్చుకుని, ఇజ్రాయెల్ కు అనుకూలంగా మాట్లాడటం గమనార్హం. 

More Telugu News