విమానం గాల్లో ఉండగానే ఇంజిన్లు బంద్ చేసేందుకు పైలట్ యత్నం!
- అలాస్కా ఎయిర్‌లైన్స్‌లో ఆదివారం షాకింగ్ ఘటన
- కాక్‌పిట్‌లో ప్రయాణిస్తున్న ఆఫ్-డ్యూటీ పైలట్ ఇంజిన్లను ఆపేందుకు ప్రయత్నం
- కెప్టెన్, కోపైలట్ అతడిని అడ్డుకున్న వైనం
- విమానాన్ని పోర్ట్‌లాండ్‌లో అత్యవసరంగా దించివేత, నిందితుడి అరెస్టు
ఈ క్రమంలో విమానాన్ని అత్యవసరంగా పోర్ట్‌లాండ్‌లో దింపి నిందితుడిని అరెస్టు చేశారు. విమానంలోని మొత్తం 83 ప్రయాణికులపై హత్యాయత్నానికి పాల్పడినందుకు నిందితుడిపై కేసు నమోదైంది. నిబంధనల ప్రకారం, డ్యూటీలో లేని పైలట్లు విమానం కాక్‌పిట్‌లోని జంప్ సీటులో కూర్చుని ప్రయాణించేందుకు అనుమతి ఉంది. అయితే, విమాన పైలట్ అనుమతిచ్చాకే ఆఫ్ డ్యూటీ పైలట్లను కాక్‌పిట్‌లోకి రానిస్తారు.