మా కుటుంబం తరుపున అందరికీ దసరా శుభాకాంక్షలు.. సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు ట్వీట్
- దసరాకు ఎప్పుడూ కుటుంబానికి దూరంగా లేనన్న హిమాన్షు
- దసరా కోసమే ఇంటికి వచ్చానని వెల్లడి
- ఇంట్లో సెలబ్రేషన్ ఫొటోస్ షేర్ చేసిన హిమాన్షు
‘మా కుటుంబం తరపున అందరికీ దసరా శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా దసరా పండుగను తాను ఎలా సెలబ్రేట్ చేసుకుంటాడో ప్రస్తావించాడు. దసరా పండుగకు ఎప్పుడూ కుటుంబానికి దూరంగా లేనని, దసరా కోసమే వారంపాటు ఇంటికి వచ్చానని హిమాన్షు వెల్లడించాడు. అదృష్టం కొద్దీ మిడ్-సెమిస్టర్ హాలిడేస్ కలిసొచ్చాయని పేర్కొన్నాడు. తాతయ్య, నాన్నమ్మ దంపతులు, తల్లిదండ్రుల సమక్షంలో ఇంట్లో జరిగిన దసరా వేడుకలకు సంబంధించిన ఫొటోలను హిమాన్షు షేర్ చేశాడు. కాగా హిమాన్షు ఉన్నత చదువుల కోసం అమెరికాలో ఉంటున్న విషయం తెలిసిందే.