థియేటర్లలో దిగిపోతున్న సంపూ సినిమా .. 'మార్టిన్ లూథర్ కింగ్'
- సంపూ హీరోగా 'మార్టిన్ లూథర్ కింగ్'
- గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ
- కథానాయికగా శరణ్య ప్రదీప్
- దర్శకురాలిగా పూజ కొల్లూరు పరిచయం
- ఈ నెల 27వ తేదీన విడుదల
దసరా పండుగ సందర్భంగా ఈ సినిమా టీమ్ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ సినిమాను ఈ నెల 27వ తేదీన విడుదల చేయనున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే కథ ఇది. అమాయకుడైన హీరో రాజకీయ పార్టీల మధ్య ఎలా చిక్కుకున్నాడు? ఆ తరువాత పరిస్థితులను ధైర్యంగా ఎదిరించి ఎలా నిలబడ్డాడు? అనేదే కథ.
శశికాంత్ - చక్రవర్తి నిర్మించిన ఈ సినిమాకి, పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. సంపూ జోడీగా శరణ్య ప్రదీప్ నటించిన ఈ సినిమాకి, శరణ్ సాయి సంగీతాన్ని అందించాడు. నరేశ్ .. గోపరాజు రమణ ముఖ్యమైన పాత్రలను పోషించారు. 'కొబ్బరిమట్ట' తరువాత హిట్ లేని సంపూకి, ఈ సినిమా ఊరటనిస్తుందేమో చూడాలి.