Nayanatara: కమల్ మూవీ కోసం ఐశ్వర్య రాయ్ తరువాత తెరపైకి నయనతార!

  • కమల్ తో సినిమా ప్లాన్ చేసిన మణిరత్నం 
  • చాలా గ్యాప్ తరువాత సెట్స్ పైకి వెళుతున్న కాంబినేషన్ 
  • తారాగణం పరంగా ఆసక్తినిరేపుతున్న ప్రాజెక్టు 
  • నిర్మాణ భాగస్వామిగా ఉన్న కమల్  
Nayanatara Special

చాలా గ్యాప్ తరువాత కమల్ - మణిరత్నం కాంబినేషన్లో మరో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. భారీ బడ్జెట్ తో నిర్మితం కానున్న ఈ సినిమాకి, కమల్ కూడా ఒక నిర్మాణ భాగస్వామిగా ఉండటం విశేషం. ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. ఈ కాంబినేషన్ పట్ల అభిమానులంతా ఆసక్తితో ఉన్నారు. 

ఈ సినిమాలో కథానాయికగా ఐశ్వర్యారాయ్ పేరు వినిపించింది. మణిరత్నం పట్ల ఐశ్వర్యరాయ్ కి గురుభావం ఉంది. అందువలన ఆమె ఈ సినిమా చేయడం ఖాయమనే టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు తెరపైకి నయనతార పేరు వచ్చింది. అది ఐశ్వర్యారాయ్ కోసం అనుకున్న పాత్రనా? లేదంటే మరో పాత్రనా? అనే విషయంలో క్లారిటీ రావలసి ఉంది.

ఈ సినిమాలో గెస్టు రోల్ కోసం రజనీని మణిరత్నం సంప్రదించిన వార్త ఇంతకుముందే వచ్చింది. అలాగే 'పొన్నియిన్ సెల్వన్' సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన 'త్రిష'కి కూడా ఒక ప్రత్యేకమైన పాత్ర ఈ సినిమాలో ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మొత్తాన్ని అనేక విశేషాలు ఈ సినిమాలో ఉండేలా మణిరత్నం ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.

More Telugu News