JP Nadda: రాజకీయ ప్రత్యర్థులను ఒకటిగా చేసిన ధర్మశాల వరల్డ్ కప్ మ్యాచ్

Cricket match brings political rivals together
  • ధర్మశాలలో నిన్న ఇండియా, న్యూజిలాండ్ మ్యాచ్
  • మ్యాచ్ ను వీక్షించిన నడ్డా, సుకు, అనురాగ్ ఠాకూర్ తదితరులు
  • స్నేహితుల మాదిరి ఆనందంగా గడిపిన వైనం
రాజకీయాల్లో కూడా కొన్నికొన్ని సార్లు అరుదైన ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా మరో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. అనుక్షణం తీవ్ర రాజకీయ విమర్శలు చేసుకునే కాంగ్రెస్, బీజేపీ నేతలు ఒకేచోట చేరి, పక్కపక్కనే కూర్చొని క్రికెట్ మ్యాచ్ ను ఆస్వాదించారు. నిన్న ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య ధర్మశాలలో జరిగిన మ్యాచ్ లో ఈ సన్నివేశం చోటుచేసుకుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ నేత, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్ వీందర్ సింగ్ సుకు, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, కాంగ్రెస్ రాష్ట్ర మంత్రి హర్ష్ వర్ధన్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో విపక్ష నేత జైరామ్ ఠాకూర్ లు ఒకేచోట కూర్చొని మ్యాచ్ చూశారు. రాజకీయాలను పక్కన పెట్టి... మంచి స్నేహితుల మాదిరి సంతోషంగా మ్యాచ్ ని ఎంజాయ్ చేశారు. 

జేపీ నడ్డా, అనురాగ్ ఠాకూర్ ల మధ్యలో సీఎం సుకు కూర్చోవడం అందరినీ ఆకర్షించింది. అనురాగ్ ఠాకూర్ చేతిని సుకు పట్టుకుని సరదాగా గడిపారు. వీరి కలయికకు సంబంధించిన ఫొటోలు సోషట్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
JP Nadda
BJP
Cricket Match

More Telugu News