టాలీవుడ్‌కు మరో కొత్త డైరెక్టర్.. ఎంట్రీకి రెడీ అయిన త్రివిక్రమ్ కొడుకు

Trivikram Srinivas Son Rishi Manoj Ready To Enter Tollywood As A Director
  • మెగాఫోన్ పట్టబోతున్న రిషీ మనోజ్
  • ప్రస్తుతం శిక్షణ తీసుకుంటున్నాడన్న త్రివిక్రమ్ భార్య
  • వైరల్ అవుతున్న రిషి ఫొటో
మిగతా రంగాలతో పోలిస్తే సినీ, రాజకీయ రంగాల్లో వారసుల ప్రభావం బాగానే ఉంటుంది. హీరో కొడుకులు హీరోలు అవుతున్నట్టుగానే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కొడుకు రిషీ మనోజ్ మెగా ఫోన్ పట్టేందుకు రెడీ అయ్యాడు. త్వరలోనే అతడు దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య తెలిపారు. డైరెక్షన్‌పై రిషికి బాగా ఆసక్తి ఉందని, ప్రస్తుతం శిక్షణ తీసుకుంటున్నాడని పేర్కొన్నారు. 

ఓ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటి వరకు రిషి ఎలా ఉంటాడో ఎవరికీ పెద్దగా తెలియదు. అతడు డైరెక్టర్ కాబోతున్నాడన్న వార్త బయటకు వచ్చిన తర్వాత అతడి ఫొటో వైరల్ అవుతోంది. సాయి సౌజన్య, రిషితో దిగిన ఫొటోను సిరివెన్నెల సీతారామశాస్త్రి తనయుడు, నటుడు రాజా తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేశారు.
Go Back to Shorts
Rishi Manoj
Tollywood
Trivikram Srinivas
Dirction

More Telugu News