రేపు సద్దుల బతుకమ్మ.. హైదరాబాద్‌లో రేపు పొరపాటున కూడా ఈ రోడ్లపైకి వెళ్లొద్దు సుమా!
- రేపు మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 11 గంటల వరకు ఆంక్షలు
- ట్యాంక్‌బండ్‌పైకి వాహనాలకు నో ఎంట్రీ
- బతుకమ్మ సంబరాలకు వచ్చే వారికి స్నో వరల్డ్, ఎన్టీఆర్ స్టేడియం, ఎన్టీఆర్ గార్డెన్లో పార్కింగ్
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..
* సికింద్రాబాద్ నుంచి ట్యాంక్‌బండ్ వైపు వచ్చే వాహనాలను కర్బాలా మైదాన్ వద్ద బైబిల్ హౌస్ మీదుగా తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వైపు డైవర్ట్ చేస్తారు.
*ఇక్బాల్ మినార్ నుంచి వచ్చే వాహనాలను తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వైపు మళ్లిస్తారు.
* పంజాగుట్ట, రాజ్‌భవన్ రోడ్డు నుంచి ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ మీదుగా వచ్చే వాహనాలను నెక్లెస్ రోటరీ ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఐమాక్స్ రూట్లోకి మళ్లిస్తారు.
* నల్లగుట్ట నుంచి బుద్దభవన్ వైపు వాహనాలకు అనుమతి లేదు. నల్లగుట్ట క్రాస్‌రోడ్డు వద్ద రాణిగంజ్, నెక్లెస్ రోడ్డు వైపు డైవర్ట్ చేస్తారు.
* హిమయత్‌నగర్, బషీర్‌బాగ్, అంబేద్కర్ విగ్రహం వైపు నుంచి ట్యాంక్‌బండ్‌పైకి వాహనాలకు అనుమతి లేదు. ఇక్బాల్ మినార్ వైపు వెళ్లి యూ టర్న్ తీసుకొని తెలుగు తల్లి జంక్షన్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌పై నుంచి వెళ్లాల్సి ఉంటుంది.
* ముషీరాబాద్ నుంచి ట్యాంక్‌బండ్ వైపు వచ్చే వాహనాలను కవాడిగూడ క్రాస్‌రోడ్డు వద్ద డైవర్ట్ చేస్తారు.