TSPSC: గ్రూప్ 1 రద్దుపై సుప్రీంకోర్టుకు టీఎస్ పీఎస్సీ?

  • ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేసిన హైకోర్టు
  • సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన చైర్మన్
  • ఢిల్లీలో లాయర్లతో టీఎస్ పీఎస్సీ చైర్మన్, సెక్రటరీ చర్చలు
The road to TSPSC Group I exam may lead to Supreme Court

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) ఇటీవల నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ పలువురు అభ్యర్థులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన రాష్ట్ర హైకోర్టు.. పరీక్షను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే, హైకోర్టు ఆదేశాలపై టీఎస్ పీఎస్సీ సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. సీనియర్ అడ్వకేట్ ద్వారా సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.

ఈ విషయంలో సుప్రీం లాయర్లతో సంప్రదింపుల కోసం టీఎస్ పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, సెక్రటరీ అనితా రామచంద్రన్ ఢిల్లీకి వెళ్లారు. సుప్రీంకోర్టులో అనుకూలంగా తీర్పు వస్తే ఎలక్షన్ కమిషన్ నుంచి అనుమతి తీసుకుని ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేయాలని కమిషన్ అధికారులు భావిస్తున్నారు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తే తదుపరి ఏంచేయాలనే విషయంపైనా అధికారులు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

More Telugu News