సింగర్ గీతామాధురితో విడాకుల వార్తలపై క్లారిటీ ఇచ్చిన నందూ
- ప్రేమ వివాహం చేసుకున్న గీతామాధురి, నందూ
- మనస్పర్థల కారణంగా ఇద్దరూ విడిపోతున్నారని వార్తలు
- ఈ వార్తలను చూసి ఇద్దరం నవ్వుకున్నామన్న నందూ
తాజాగా ఈ వార్తలపై నందూ స్పందించాడు. 'మాన్షన్ 24' సినీ ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో నందూ మాట్లాడుతూ... ఈ వార్తల్లో నిజం లేదని చెప్పాడు. ఈ వార్తలను చూసి తామిద్దరం నవ్వుకున్నామని తెలిపాడు. ఇలాంటి వార్తలను తాము పట్టించుకోబోమని అన్నారు. ఎవరో ఏదో రాసినంత మాత్రాన తాము స్పందించాల్సిన అవసరం లేదని చెప్పాడు. ఈ వార్తలపై క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతోనే తాను ఇప్పుడు స్పందించానని తెలిపాడు. నందూ క్లారిఫికేషన్ తోనైనా ఈ పుకార్లకు చెక్ పడుతుందేమో చూడాలి.