Team India: కివీస్ తో మ్యాచ్ కోసం ధర్మశాల చేరుకున్న టీమిండియా... జర్నీ వీడియో పంచుకున్న బీసీసీఐ

Team India arrives Dharmashala
  • గురువారం నాడు పూణేలో బంగ్లాదేశ్ పై గెలిచిన టీమిండియా
  • తదుపరి మ్యాచ్ ను న్యూజిలాండ్ తో ఆడనున్న రోహిత్ సేన
  • అక్టోబరు 22న ధర్మశాలలో కీలక పోరు

వరల్డ్ కప్ లో గురువారం నాడు బంగ్లాదేశ్ పై ఘనవిజయం సాధించిన టీమిండియా తన తదుపరి మ్యాచ్ ను న్యూజిలాండ్ తో ఆడనుంది. అక్టోబరు 22న ఈ మ్యాచ్ ధర్మశాలలో జరగనుంది. కివీస్ తో పోరు కోసం టీమిండియా నేడు ధర్మశాల చేరుకుంది. పూణే నుంచి ప్రత్యేక విమానంలో భారత ఆటగాళ్లు ధర్మశాల చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా తమకు కేటాయించిన హోటల్ కు చేరుకున్నారు. దీనికి సంబంధించిన ట్రావెల్ వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకుంది.  

కాగా, టోర్నీలో టీమిండియా, న్యూజిలాండ్ నాలుగేసి విజయాలతో పాయింట్ల పట్టికలో పై భాగాన ఉన్నాయి. ఈసారి టైటిల్ ఫేవరెట్లుగా పేర్కొంటున్న ఈ రెండు జట్లు గత వరల్డ్ కప్ లో సెమీస్ లో తలపడగా, న్యూజిలాండ్ జట్టునే విజయం వరించింది.

  • Loading...

More Telugu News