చెన్నైకి మకాం మార్చనున్న ఆమిర్ ఖాన్... ఎందుకంటే...!
- అనారోగ్యంతో బాధపడుతున్న ఆమిర్ ఖాన్ తల్లి
- చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స
- తల్లికి దగ్గరగా ఉండాలని ఆమిర్ నిర్ణయం
ఆమిర్ ఖాన్ చివరగా నటించిన చిత్రం లాల్ సింగ్ చద్ధా. హాలీవుడ్ హిట్ చిత్రం ఫారెస్ట్ గంప్ కు ఇది రీమేక్! కానీ, లాల్ సింగ్ చద్ధా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా ద్వారానే అక్కినేని నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా ఫలితం తర్వాత ఆమిర్ ఖాన్ నటనకు విరామం ప్రకటించారు. ఇక సినిమా నిర్మాణంపై దృష్టి సారిస్తానని తెలిపారు.