'వ్యూహం' సినిమా విడుదల కాకుండా ఆపాలంటున్న నిర్మాత నట్టి కుమార్
- వర్మ తెరకెక్కిస్తున్న పొలిటికల్ చిత్రం వ్యూహం
- జగన్ జీవితంలోని కీలక ఘట్టాల ఆధారంగా చిత్రం
- నవంబరు 10న ప్రేక్షకుల ముందుకు వస్తున్న వ్యూహం
- తెలంగాణలో ఎన్నికల వేళ ఈ సినిమా విడుదల మంచిది కాదన్న నట్టి కుమార్
ఈ చిత్రంలో జగన్ ను, వైసీపీని గొప్పగా చూపించి, విపక్షాలను తక్కువ చేసి చూపించారని నట్టి కుమార్ వెల్లడించారు. ఇది ఏపీకి సంబంధించిన ఇతివృత్తం అయినప్పటికీ, త్వరలోనే తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నందున తెలంగాణలోనూ ఈ సినిమా ప్రభావం చూపించే అవకాశం ఉందని తెలిపారు.
ఇందులో చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, సోనియా గాంధీ వంటి వాళ్లను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారని నట్టి కుమార్ ఆరోపించారు. ఈ అంశం తెలంగాణ ఓటర్లపై ప్రభావం చూపుతుందని వివరించారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, ఈ పరిస్థితుల్లో వ్యూహం సినిమా విడుదల మంచిది కాదని పేర్కొన్నారు .