Calcutta: లైంగిక కోరికలను నియంత్రించుకోండి: టీనేజ్ అమ్మాయిలకు కలకత్తా హైకోర్టు కీలక సూచన

  • మైనర్ అమ్మాయితో టీనేజ్ అబ్బాయికి లైంగిక సంబంధం
  • అబ్బాయికి 20 ఏళ్ల జైలు శిక్షను విధించిన సెషన్స్ కోర్టు
  • సెషన్స్ కోర్టు తీర్పును పక్కన పెట్టిన హైకోర్టు
Court urged girls to control their sexual urges

టీనేజ్ వయసులో అమ్మాయిలు, అబ్బాయిలు హద్దులు దాటుతున్న ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీనేజర్లకు కలకత్తా హైకోర్టు కీలక సూచన చేసింది. అమ్మాయిలు, అబ్బాయిలు కామ కోరికలను నియంత్రించుకోవాలని సూచించింది. ఒక మైనర్ అమ్మాయితో శృంగారంలో పాల్గొన్న కేసులో ఓ టీనేజ్ అబ్బాయికి సెషన్స్ కోర్టు 20 ఏళ్ల జైలు శిక్షను విధించింది. ఈ నేపథ్యంపై తనకు విధించిన శిక్షను రద్దు చేయాలని కోరుతూ కలకత్తా హైకోర్టును అతను ఆశ్రయించాడు. ఈ కేసులో వాదనల సందర్భంగా హైకోర్టు ఈ మేరకు సూచనలు చేసింది. 


వాదనల సందర్భంగా... తన ఇష్టపూర్వకంగానే అతనితో రిలేషన్ లో ఉన్నానని కోర్టుకు అమ్మాయి తెలిపింది. అతన్ని పెళ్లి కూడా చేసుకున్నానని తెలిపింది. అయితే 18 ఏళ్లలోపు పెళ్లి చేసుకోవడం చట్ట విరుద్ధం అనే విషయాన్ని కూడా ఆమె అంగీకరించింది. పోస్కో చట్టం ప్రకారం 18 ఏళ్ల లోపు శృంగారంలో పాల్గొంటే అది రేప్ కిందకు వస్తుంది. 

ఈ సందర్భంగా హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం స్పందిస్తూ... రెండు నిమిషాల సుఖం కోసం బాలికలు మొగ్గు చూపరాదని, లైంగిక కోరికలను నియంత్రించుకోవాలని సూచించింది. రెండు నిమిషాల సుఖం కోసం సమాజంలో చెడ్డ పేరు తెచ్చుకోవద్దని హితవు పలికింది. ఆత్మ గౌరవం అన్నిటికంటే ముఖ్యమని చెప్పింది. అబ్బాయిలు కూడా అమ్మాయిల గౌరవాన్ని కాపాడేలా వ్యవహరించాలని తెలిపింది. విద్యాలయాల్లో సెక్స్ ఎడ్యుకేషన్ ఉండాలని చెప్పింది. మరోవైపు సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం పక్కన పెట్టింది.

More Telugu News