బొమ్మలా నిలబడి జువెలరీ షాపులో యువకుడు నగల చోరీ!
- పోలాండ్‌లోని వార్సా నగరంలో ఘటన
- షాపింగ్ సెంటర్లోని పలు దుకాణాల్లో యువకుడు చోరీ
- సెక్యూరిటీ సిబ్బందికి చిక్కి చివరకు జైలుపాలు
షాపింగ్ సెంటర్ మూసేశాక యువకుడు తీరిగ్గా తనకు కావాల్సిన నగలు చోరీ చేశాడు. ఆ తరువాత ఓ రెస్టారెంట్‌కు వెళ్లి సుష్టుగా తిని ఆపై మరో దుస్తుల షాపులో దుస్తులు కూడా చోరీ చేశాడు. కానీ చివర్లో అతడిని దురదృష్టం వెంటాడడంతో సెక్యూరిటీ సిబ్బందికి దొరికిపోకతప్పలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడు మరో షాపింగ్ సెంటర్‌లో కూడా ఇలాగే చోరీకి పాల్పడ్డట్టు పోలీసులు తెలిపారు. నిందితుడికి 10 ఏళ్ల వరకూ శిక్ష పడే అవకాశం ఉందని చెప్పారు.