Himanta Sarma: హమాస్ తో కలిసి పోరాడేందుకు పవార్ తన కూతురును పంపిస్తాడేమో!: అసోం ముఖ్యమంత్రి వ్యంగ్యం

  • ఇజ్రాయెల్ కు ప్రధాని మోదీ మద్దతు పలకడాన్ని తప్పుబట్టిన పవార్
  • మిలిటెంట్లకు మద్దతుగా నిలబడాలా అంటూ ప్రశ్నించిన హిమంత బిశ్వ శర్మ
  • టెర్రరిస్టులకు అనుకూలంగా మాట్లాడతారని ఊహించలేదన్న పీయూష్ గోయెల్  
Think Sharad Pawar Will Send His Daughter To Gaza Himanta Sarma

గాజాలోని హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇరువర్గాల మధ్య పోరు భీకరంగా కొనసాగుతోంది. రాకెట్ దాడులతో అటు గాజాలో, ఇటు ఇజ్రాయెల్ లోనూ ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతోంది. ఈ యుద్ధంలో ముస్లిం దేశాలు పాలస్తీనాకు మద్దతు తెలపగా.. భారత్ సహా చాలా దేశాలు ఇజ్రాయెల్ వైపు నిలబడ్డాయి. ఈ క్రమంలోనే భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఇజ్రాయెల్ కు అనుకూలంగా మాట్లాడారు. మిలిటెంట్లపై పోరులో ఇజ్రాయెల్ కు మద్దతు తెలిపారు. ఈ వ్యాఖ్యలను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ తప్పుబట్టారు. పాలస్తీనాకు అనుకూలంగా ఆయన మాట్లాడారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది.

ఈ వ్యాఖ్యలపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తీవ్రంగా స్పందించారు. హమాస్ మిలిటెంట్లకు మద్దతుగా పవార్ తన కూతురును పంపిస్తాడేమో అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ స్పందిస్తూ.. ప్రపంచంలో టెర్రరిజం ఏ రూపంలో ఉన్నా ఖండించాల్సిందేనని స్పష్టం చేశారు. ఓ సీనియర్ పొలిటికల్ లీడర్ అయిన శరద్ పవార్.. టెర్రరిస్టులకు అనుకూలంగా మాట్లాడతారని ఊహించలేదని చెప్పారు. దేశానికి రక్షణ మంత్రిగా, ఓ రాష్ట్రానికి పలుమార్లు ముఖ్యమంత్రిగా చేసిన నేత ఇలా మిలిటెంట్లకు అనుకూలంగా మాట్లాడటమేంటని ప్రశ్నిస్తూ గోయెల్ ట్వీట్ చేశారు.

More Telugu News